రామోజీరావు అక్షర యోధుడు: వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి
- అక్షర యోధుడు, మీడియాలో యుగకర్త అని కొనియాడిన సీఎం చంద్రబాబు
- సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించారని ప్రశంస
- మీడియా వ్యాపారం కాదు, సామాజిక బాధ్యత అని రామోజీ చాటిచెప్పారన్న సీఎం
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, దివంగత రామోజీరావును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా స్మరించుకున్నారు. రామోజీరావు రెండో వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, మీడియా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, మీడియా రంగంలో యుగకర్త, అక్షర యోధుడు శ్రీ రామోజీరావు అని చంద్రబాబు అభివర్ణించారు.
"సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్య శిఖరాలను అధిరోహించిన వ్యక్తి రామోజీరావు. మీడియాను ప్రజా చైతన్యానికి వేదికగా మలిచిన ఆయన సేవలు చిరస్మరణీయం" అని పేర్కొన్నారు. విలువలు, క్రమశిక్షణ, నిబద్ధత, ధైర్యసాహసాలతో నడిచిన ఆయన ప్రస్థానం తరతరాలకు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు అన్నారు.
"పత్రికా రంగం అంటే వ్యాపారం కాదు, అదొక సామాజిక బాధ్యత అని భావించి, ఆచరించి చూపిన ఆదర్శవాది రామోజీరావు. తెలుగు ప్రజలు గర్వించే మీడియా సంస్థలను అందించిన ఆయన స్థానం ప్రజల హృదయాల్లో శాశ్వతం" అని చంద్రబాబు పేర్కొన్నారు.